చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు (Road Accident) ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని ఖైతాపురం వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు ఓ లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
Accidenatt
మృతిచెందిన వారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డీఎస్పీలు మేక చక్రధర్ రావు, కాంతారావుగా గుర్తించారు. ఏపీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నదని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.