అమరావతి : శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కుశాలపురం గ్రామానికి చెందిన పగిడి రవి అనే వ్యక్తి స్థానికంగా రైసుమిల్లును నిర్వహిస్తున్నాడు. బుధవారం రైసుమిల్లులో విద్యుత్ బల్బు మార్పుకోసం ఇబ్రహీంబాగ్ గ్రామానికి చెందిన ధనంజయ రావు (31) అనే ఎలక్ట్రిషియన్ను వెంట తీసుకెళ్లాడు. బల్బు మార్పు కోసం ఐరన్ నిచ్చెన వేసుండగా ప్రమాదవశాత్తు నిచ్చెన హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగలడంతో కరెంట్ షాక్కు గురై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో మరో కూలి నర్సింహ వీరిని కాపాడేందుకు ప్రయత్నించి గాయాలపాలయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.