Road Accident | సత్యసాయి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మడకశిర మండలం ఆగ్రంపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున బోలెరో వాహనాన్ని ఐచర్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అదే దారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రిక తలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్యసాయి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను మడకశిర పట్టణానికి చెందిన వడ్రపాలెం రఘురాం, సీకేపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
మరోవైపు నంద్యాల జిల్లా చాబోలు వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు.