అమరావతి : అనకాపల్లి (Anakapalli) జిల్లా ఎలమంచిలిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు స్నేహితులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. విశాఖ జిల్లా గాజువాకకు చెందిన బంగారి జగన్(18), దిమిలికి చెందిన శ్రీను(18) అనే ఇద్దరు మంచి మిత్రులు. ఇద్దరు బుధవారం ఎలమంచిలి తెరువుపల్లి సమీపంలో ఉన్న మైనర్ శారదా నది(River) కి స్నానానికి వెళ్లారు.
స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు శ్రీను గోతిలో పడి మునిగిపోగా అతడిని కాపాడడానికి జగన్ ప్రయత్నించగా అతడు కూడా గోతిలో జారి పడిపోయాడు. వీరిని గుర్తించిన స్థానికులు ఇద్దరినీ రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే శ్రీను కోల్పోగా, కొన ఊపిరితో ఉన్న జగన్ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జగన్ మృతి చెందడంతో ఇరువురి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి . పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు .