భద్రాద్రి, కొత్తగూడెం : తెలంగాణలోని భద్రాద్రి(Badradri,) కొత్తగూడెం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని అశ్వారావుపేట సమీపంలో లారీ , ద్విచక్రవాహనం ఢీకొనగా ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు మనోజ్(27), వెంకటేశ్వరరావు(58) ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడడంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
లారీ డ్రైవర్ను అశ్వారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.