అమరావతి : అనంతపురం జిల్లా వెంకటాపురంలో విషాదం నెలకొంది. జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలం కల్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకి సర్కిల్లో ఉంటున్న ఇద్దరు అన్నదమ్ములు నరేంద్ర(32), చరణ్(25) మామిడి తోటలో ఉన్న నీటి కుంటలో ప్రమాదవశాత్తు పడి చనిపోయారు.
వారి తల్లిదండ్రులు, కూలీలతో కలిసి మామిడి చెట్లకు పురుగు మందు పిచికారీ చేసేందుకు వెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తమ్ముడు చరణ్ కాలుజారి నీటిలో పడిపోగా అతడిని కాపాడేందుకు వెళ్లిన నరేంద్ర కూడ మునిగి ఈత రాక ఇద్దరు ప్రాణాలు కోల్పోయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.