Tirumala Darshan | శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో సిఫార్సు లేఖలు బంద్!
Tirumala Darshan | శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.! స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున తిరుమలలో శ్రీవారి దర్శనం, వసతి కోసం ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. ఎ
Tirumala Darshan | శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.! స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున తిరుమలలో శ్రీవారి దర్శనం, వసతి కోసం ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంతవరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని తెలిపింది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం, వసతి కల్పిస్తామని టీటీడీ వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ తిరుమల పర్యటనను ప్రణాళిక చేసుకోవాలని, టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

Ttd Br Naidu
సమిష్టి కృషితో నవరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం
మరోవైపు, శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను టీటీడీ, జిల్లా యంత్రాంగం, పోలీసుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, భక్తులకు అందించిన సేవలను వివరించారు.
అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు జరిగిన బ్రహ్మోత్సవాల్లో దేశవిదేశాల నుంచి వచ్చిన భక్తులకు వాహనసేవలతో పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించినట్లు చెప్పారు. గరుడసేవ రోజున భారీ వర్షం కురిసినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అల్పాహారం, అన్నప్రసాదాలు, బాదం పాలు, సుండలు, జ్యూస్, బిస్కెట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
అక్టోబరు 12 నుంచి 19వ తేదీ వరకు ఎనిమిది రోజుల్లో భక్తులకు అందించిన సేవల వివరాలను టీటీడీ చైర్మన్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 6.46 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రూ.25.79 కోట్ల హుండీ కానుకలు వచ్చాయి. 22.60 లక్షల అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. 2.44 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 34.34 లక్షల లడ్డూలను విక్రయించారు. గరుడసేవ రోజున చైర్మన్తో పాటు పాలకమండలి సభ్యులు, ఉన్నతాధికారులు గ్యాలరీలు, క్యూలైన్లలో పర్యటించి భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలకు ముందు 26 రాష్ట్రాలు, ఖతర్, దుబాయ్ నుంచి వచ్చిన 252 కళాబృందాలకు చెందిన సుమారు 6,777 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు. గరుడసేవ రోజున 17 రాష్ట్రాలకు చెందిన 31 కళాబృందాల నుంచి 863 మంది కళాకారులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా సుమారు 60 టన్నుల పుష్పాలు, ఐదు లక్షల కట్ఫ్లవర్స్, 80 వేల సీజనల్ పుష్పాలతో అలంకరణలు చేపట్టారు. తిరుమల, తిరుపతిలో విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేయడంతో పాటు వాహనసేవలను భక్తులు వీక్షించేందుకు 36 భారీ డిజిటల్ స్క్రీన్లను అందుబాటులో ఉంచారు. ఎస్వీబీసీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించారు.
సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
నవరాత్రి బ్రహ్మోత్సవాల విజయవంతానికి సహకరించిన అర్చక స్వాములు, పాలకమండలి సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగాలు, శ్రీవారి సేవకులు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, భక్తులకు బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాల విశేషాలను ప్రపంచవ్యాప్తంగా భక్తులకు చేరవేసిన మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Posters | టాలీవుడ్లో పండగ జోష్.. దసరా కానుకగా సందడి చేసిన కొత్త సినిమాల పోస్టర్లు చూశారా!
Tirumala Darshan | శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో సిఫార్సు లేఖలు బంద్!
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

