ఆంజనేయుని జన్మస్థలం విషయంలో వివాదమే లేదు: టీటీడీ

తిరుమలలోని ఆకాశగంగ ప్రాంతం హనుమంతుని జన్మ స్థలమని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కమిటీ ప్రకటించిన నేపథ్యంలో ఆకాశగంగ వద్ద ఈ నెల నాలుగో తేదీ నుంచి 8వ తేదీ దాకా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు.
తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ పంచాంగంలో నిర్దేశించిన ప్రకారం ప్రతి ఏటా చేసే కార్యక్రమాలు యథాతథంగా చేస్తామన్నారు. ఈ సారి ఆకాశగంగలో 4వ తేదీ నుంచి 8వ తేదీ దాకా రోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వివరించారు.
ప్రతిరోజూ ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు అంజనాదేవి, బాల హనుమంతల వారికి అభిషేకం, రోజుకొక పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ధర్మారెడ్డి చెప్పారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు హనుమాన్ చాలీసా ఉంటుందన్నారు. తిరుమలకు వచ్చే యాత్రికులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనుమతిస్తామన్నారు.
వచ్చే ఏడాది మరింత వైభవంగా ఆకాశగంగ వద్ద హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంజనేయ స్వామి రాక్షసుల బారి నుంచి ప్రజలను విముక్తులను చేశారని, కరోనా మహమ్మారి నుంచి ప్రజలను విముక్తులను చేయడానికి కూడా ఈ కార్యక్రమాలన్నీ ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

