తిరుమల : అమరావతిలో వేంకటపాలెంలో శనివారం సాయంత్రం జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవంలో పాల్గొనాలని ( Srinivasa Kalyanotsavam ) సీఎం చంద్రబాబు( CM Chandrababu ) కు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆహ్వాన పత్రికను అందజేశారు. శుక్రవారం విజయవాడ ఉండవల్లిలో టీటీడీ బోర్డు సభ్యులు, ఈవో జె. శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకన్న చౌదరి ఆహ్వానం పత్రికను అందజేశారు.
అనంతరం ఏపీ రాష్ట్ర హెచ్ఆర్డీ , ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎం ఎస్ రాజు, నన్నపనేని సదాశివరావు, ముని కోటేశ్వరరావు, ఆర్ ఎన్ దర్శన్, ఎం.శాంతారామ్, తమ్మిసెట్టి జానకి దేవి, సుచిత్ర ఎల్లా, ఎస్ నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.