తిరుమల : తిరుమల లడ్డూ (Tirumala Laddu) తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ (Adultration) జరిగిన ఘటన సంచలనం కలిగించగా దానిపై టీటీడీ బుధవారం పోలీసులకు ఫిర్యాదు (TTD complaint) చేసింది. తిరుపతి తూర్పు పోలీసు స్టేషన్లో ఏఆర్ డెయిరీ(AR Dairy ) ఫుడ్ ఫ్రొడెక్ట్ లిమిటెడ్‌పై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఫ్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు .
నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఆరోపించారు. ఈ యేడాది మే 15న నెయ్యి సప్లైకి ఆర్డర్స్ ఇవ్వగా , జూన్ 12, 20, 25 తేదీలతో పాటు జులై 6, 12న 4 ట్యాంకర్ల నెయ్యి ఏఆర్ డెయిరీ సరఫరా చేసిందని వివరించారు. ఏఆర్ డెయిరీ సప్లై చేసిన నెయ్యిని ఎన్‌డీబీఎల్ సహకారంతో అడల్ట్రేషన్ టెస్టింగ్ నిర్వహించామన్నారు. నెయ్యిలో వెజిటెబుల్ ఆయిల్, అనిమల్ ఫ్యాట్ కల్తీ జరిగినట్టు రిపోర్టు వచ్చిందన్నారు.
జులై 22, 23, 27 తేదీల్లో ఏఆర్ డెయిరీకి షోకాజ్ నోటీసులు జారీ చేశామని టీటీడీ వెల్లడించింది. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని సెప్టెంబర్ 4న ఏఆర్ డెయిరీ సమాధానం ఇచ్చిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కల్తీకి పాల్పడిన ఏఆర్ డెయిరీపై చర్యలు తీసుకోవాలని బుధవారం టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు.