తిరుమల : తిరుమల ఆలయంలోపై విమానాల ప్రయాణంపై ఆంక్షలపై టీటీడీ చైర్మన్ (TTD Chairman) బీఆర్ నాయుడు కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి ( Rammohan Naidu) లేఖ రాశారు.ఆలయ పవిత్రత, ఆగమ శాస్త్రం దృష్ట్యా తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ( No-fly zone) ప్రకటించాలని కోరారు.
చిన్న విమానాలు, హెలికాప్టర్ల వల్ల ఆలయ పవిత్ర వాతావరణానికి భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటిస్తే ఆలయ వారసత్వ రక్షణకు కీలక అడుగు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ లేఖపై కేంద్ర మంత్రి రామ్మోహన్ సానుకూలంగా స్పందించారు.