అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ఓ ట్రెజరరీ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డాడు. విజయనగరం జిల్లా రాజాం ఉప ఖజానా అధికారిగా పని చేస్తున్న గోవిందరాజులు రూ. 10వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జీతాలు, ఇంక్రిమెంట్ల బిల్లులు సీఎఫ్ఎంఎస్కు పంపేందుకు ఓ మాజీ ఉద్యోగి నుంచి లంచం డిమాండ్ చేశాడు.
సదరు మాజీ ఉద్యోగి, బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఇవాళ కార్యాలయం వద్ద రూ. 10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ట్రెజరరీ అధికారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.