(Liquor Caught) ఒంగోలు : గోవా నుంచి అక్రమంగా మద్యం తెప్పించి స్థానికంగా అమ్మేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టును ఏపీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) పోలీసులు రట్టు చేశారు. కంటైనర్ నిండా మద్యం బాటిళ్లు రవాణా చేస్తున్న పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు దాడులు జరిపి 6 వేలకు పైగా మద్యం సీసాలను స్వాధీన పర్చుకున్నారు. కంటైనర్‌ను నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గోవా నుంచి పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లను రవాణా చేస్తున్న ఓ కంటైనర్‌ను ఆంధ్రప్రదేశ్ ఎస్ఈబీ పోలీసులు ప్రకాశం జిల్లా వేటపాలెం వద్ద పట్టుకున్నారు. కంటైనర్‌ను నడుపుతున్న ఒకరిని అదుపులోకి తీసుకుని కంటైనర్‌లోని 6,120 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమంగా రవాణా జరుపుతున్నట్లు తమకు అందిన పక్కా సమాచారంతో ఎస్ఈబీ పోలీసులు ఒంగోలు-వేటపాలెం బైపాస్‌లో వాహనాల తనిఖీ చేపట్టి పట్టుకున్నారు. ఒంగోలు నుంచి కఠారిపాలెం క్రాస్‌రోడ్డులో రొయ్యలు రవాణా చేసే కంటైనర్‌లో తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో మద్యం సీసాలు కనిపించాయని ఎస్ఈబీ సూపరింటెండెంట్ ఆవులయ్య తెలిపారు. పట్టుబడిన మద్యం విలువ దాదాపు రూ.14 లక్షల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. కంటైనర్ వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెంకు చెందిన ప్రళయ కావేరి వెంకటేశ్వర్లుకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. వెంకటేశ్వర్లును పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..