అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో ఉన్న ప్రముఖ ఆలయాల ఈవోలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల రెండు రోజుల క్రితం జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ కొత్త జీవోను విడుదల చేసింది. అన్నవరం ఈవోగా ఉన్న ఆజాద్‌ను దేవదాయశాఖ కమిషనర్‌కు రిపోర్టు చేయాలని ఆదేశించింది.
దేవదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్‌కు అన్నవరం అదనపు బాధ్యతలు అప్పగించారు. దుర్గగుడి ఈవో రామారావుకు శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. శ్రీకాళహస్తి ఈవోగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ఆజాద్‌ను అన్నవరం ఆలయానికి బదిలీ చేయగా తాజా ఉత్తర్వులో దేవదాయశాఖ కమిషనర్‌కు రిపోర్టు చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.