అమరావతి : గమ్యస్థానాలకు చేరుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైలు ప్రయాణికులు (Train passengers) లిఫ్ట్‌లో చిక్కుకుని మూడు గంటల పాటు నరకయాతన అనుభవించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కపురం రైల్వేస్టేషన్లో (Markapuram Railaway Station) ఈ ఘటన ఆదివారం జరిగింది.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు ప్లాట్ఫారం మారేందుకు రైల్వేస్టేషన్‌లోని లిఫ్ట్ (Lift) వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా లిఫ్ట్‌లో పరిమితికి మించి 14 మంది ఎక్కడంతో లిఫ్ట్ మధ్యలో ఒక్కసారిగా ఆగిపోయింది. దాదాపు 3 గంటలు లిఫ్ట్‌లోనే ఉండిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో స్పందించిన రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. టెక్నీషియన్లు అందుబాటులో లేకపోవడంతో పోలీసులే శ్రమించి వారిని బయటకు తీసుకువచ్చారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.