Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి తల్లి ఆత్మహత్య
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి ఇద్దరు ఆడపిల్లలతో కలసి చెరువులో దూకి ఆత్మహత్య(Suicide) చేసుకుంది.
అమరావతి : సత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి ఇద్దరు ఆడపిల్లలతో కలసి చెరువులో దూకి ఆత్మహత్య(Suicide) చేసుకుంది. జిల్లాలోని ముదిగుబ్బ మండల కేంద్రం టీచర్స్‌కాలనీకి చెందిన గంగాధర్, సుకన్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్యాభర్త మధ్యగత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త వేధింపులను భరించలేక ఆదివారం సుకన్య తన ఇద్దరు పిల్లలు దేవయాని(10), జస్మిత(9)తో కలసి సమీపంలోని చెరువులో దూకింది. గమనించిన స్థానికులు వెంటనే చెరువులో దూకి గాలింపు చర్యలు చేపట్టారు.
గాలింపులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం కాగా తల్లి సుకన్య మృతదేహం కొద్ది దూరంలో లభ్యమైంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. భార్య , భర్త మధ్య గొడవ కారణంగానే తల్లి సుకన్య ఈ దారుణానికి పాల్పడిందని భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

