అమరావతి : ఏపీలోని నెల్లూరు( Nellore) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బీచ్( Beach) లో స్నానానికి వెళ్లిను ముగ్గురు ఇంటర్ విద్యార్థులు ( Inter students ) మునిగిపోయారు. జిల్లాలోని మైపాడు బీచ్లో నెల్లూరులోని కోటమిట్టకు చెందిన ఇంటర్ విద్యార్థులు హుమాయూన్ , తాజిన్, ఆదిల్ స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు గజ ఈతగాళ్లతో గాలించగా మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు నెల్లూరులోని కోటమిట్టకు చెందినవారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.