అమరావతి : బాపట్ల( Bapatla) జిల్లాలో విషాదం నెలకొంది. కుమారుడు మృతి చెందాడన్న బాధతో ఓ తండ్రి ఆత్మహత్యకు ( Suicide) పాల్పడ్డాడు. జిల్లాలోని వేమూరు మండలం బేతాలపురంలో పొలంలో ఎరువుల బస్తాలు దించుతుండగా విద్యుత్ షాక్( Electric shock ) తో నిన్న అట్లూరి సునీల్ అనే యువకుడు మృతి చెందాడు. కుమారుడి మరణం వార్తను తెలుసుకున్న తండ్రి వెంకయ్య రేపల్లె-తెనాలి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి .
సమాచారం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవి మృతుల కుటుంబానికి సానుభూతి తెలిపారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విద్యుత్ షాక్ ప్రమాదాలు జరుగకుండా అన్ని చర్యలు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.