అమరావతి : కర్నూల్ ( Kurnool ) జిల్లాలో విషాదం (Tragedy) చోటు చేసుకుంది. నీటి కుంటలో ( Waterpond ) మునిగి ఆరుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన జిల్లాలోని ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో జరిగింది. ఐదో తరగతికి చెందిన విద్యార్థులు నీటికుంటలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. తోటి చిన్నారులు స్థానికులకు సమాచారం అందించడంతో గ్రామస్థులు నీటి కుంటలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఆరుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులకు సమాచారం అందించడంతో వారు గ్రామానికి చేరుకున్నారు.