అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు ( Nellore ) జిల్లాలో కనుమ పండుగ రోజున విషాదం (Tragedy) చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్న యువకులు కనుమను కూడా అంతే ఘనంగా జరుపుకోవటానికి సస్నద్ధం అవుతున్న సమయంలో మృతి చెందారు. జిల్లాలోని అల్లూరు మండలం ఇసుకపల్లి బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు స్నానం చేస్తూ గల్లంతయ్యారు.
వీరిలో ఒకరి మృతదేహాం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. మిగతా ముగ్గురు యువకుల కోసం మత్స్యకారులు, పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇంకా మృతి చెందిన, గల్లంతైన వారి వివరాలు తెలియరాలేదు.