అమరావతి : తెలంగాణలో విద్యార్థి కత్తిపోట్లకు ప్రిన్సిపల్ దుర్మరణం చెందిన ఘటన మరవకముందే ఏపీలో టీచర్ దెబ్బలకు కుప్పకూలి విద్యార్థి మృతి ( Student Died ) చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది.
విశాఖ ( Visaka) వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల ప్రణయ్ తేజ( Pranay Teja ) హోం వర్క్ చేయలేదన్న కోపంతో టీచర్ కొట్టంది. వెంటనే విద్యార్థి అస్వస్థతకు గురై కుప్పకూలడంతో పాఠశాల సిబ్బంది కేజీహెచ్‌కు తరలించగా మార్గమద్యలో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పాఠశాలపై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
టీచర్‌కు భయపడి కుప్పకూలి ఎల్కేజీ విద్యార్థి మృతి
విశాఖపట్నంలో దారుణ ఘటన
లిటిల్ గార్డెన్ స్కూల్లో హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో భయపడి గుక్కపెట్టి ఏడుస్తూ, కుప్పకూలి టీచర్ మీద పడిపోయిన ఎల్కేజీ విద్యార్థి ప్రణయ్ తేజ్ (6)
చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే… pic.twitter.com/KW8umxWCAu
— Telugu Scribe (@TeluguScribe) August 20, 2026