అమరావతి : పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించాలని ధర్నా చేస్తున్న రైతులకు, అడ్డుకున్న పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలోని తాండవ చక్కెర ఫ్యాక్టరీ వద్ద చోటు చేసుకుంది. ఫ్యాకర్టీకి తోలిన చెరుకు బకాయిలను చెల్లించాలని కోరుతూ అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు విజయవాడ- విశాఖపట్నం జాతీయ రోడ్డుపై భైఠాయించారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నాను విరమించుకోవాలని కోరారు.
ఈ దశలో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సుభద్రంపేటకు చెందిన అర్జున్‌రావు అనే రైతు సొమ్మసిల్లి పడిపోయాడు. అతడిని హుటాహుటిన కాకినాడ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు.