అమరావతి : విశాఖలో విషాదం (Tragedy) చోటు చేసుకుంది. భర్తతో గొడవ కారణంగా ఇద్దరు కూతుళ్లతో కలిసి భార్య ఆత్మహత్యాయత్నానికి ( Suicide attempt ) పాల్పడింది. విశాఖలోని చిట్టివలసలో నివాసముంటున్న భార్యభర్తల మధ్య శనివారం గొడవ జరిగింది . తీవ్ర మనస్తాపానికి గురైన భార్య మాధవి తన ఇద్దరు కూతుళ్లకు పురుగుల మందు తాగించి తాను తాగింది.
తీవ్ర అస్వస్థతకు గురైన వీరిని ఆసుపత్రికి తరలించగా మాధవి(25), కుమార్తె రితిక్ష(2) మృతి చెందారు. మరో కుమార్తె ఇషిత(5) ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది . స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.