అమరావతి : ఏపీలోని ప్రకాశం జిల్లాలో (Prakasam district) విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు (Students) గల్లంతయ్యారు. దర్శి మండలం కొత్తపల్లిలో నివాసముంటున్న ముగ్గురు విద్యార్థులు శనివారం సాగర్ ప్రధాన కాలువ(Sagar Main Canal ) లో ఈతకు దిగి గల్లంతయ్యారు. స్థానికులకు సమాచారం అందడంతో కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో ఒకరి మృతదేహం లభ్యం కాగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున రోదించారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.