అమరావతి : పల్నాడు ( Palnadu) జిల్లాలో విషాదం ( Tragedy ) చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన పడవ బోల్తా ( Boat Capsizes ) పడి నలుగురు గల్లంతయ్యారు. జిల్లాలోని క్రోసూరులో 10 మంది బంధువులు నదిలో పడవలో విహారయాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణంలో పడవ బోల్తా పది మంది నీటమునిగిపోయారు. గమనించిన గ్రామస్థులు నీట మునిగినవారిలో ఆరుగురిని కాపాడారు. గల్లంతైన మరో నలుగురి కోసం పోలీసులు, గ్రామస్థులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.