అమరావతి: గొర్రెలను శుభ్రపరిచేందుకు నదిలోకి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి కొట్టుకుపోతున్న మనవడిని రక్షించేందుకు వెళ్లిన తాత సైతం మృతి చెందిన విషాద ఘటన అనంతపురం జిల్లా ఎల్లానూరు మండలం లక్షుంపల్లిలో చోటు చేసుకుంది. తాడిమర్రి మండలం నాయనపల్లి గ్రామానికి చెందిన గంగన్న, ఆయన మనవడు గౌతమ్ ఈరోజు గ్రామ సమీపంలోని చిత్రావతి నదిలో గొర్రెలను శుభ్రపర్చడానికి వెళ్లారు.
గౌతమ్ కాలు నదిలోని ఇసుకలో చిక్కుకుపోవటంతో కాపాడేందుకు వెళ్లిన తాత గంగన్న ప్రమాదవశాత్తు ఇద్దరు నీటిలో మునిగి చనిపోయారు. గ్రామస్థులు గమనించి మృతదేహాలను బయటికి తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.