అమరావతి : నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం వల్ల ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావం వల్ల రాగల రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు.
గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ (Kakinada), కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
శుక్రవారం శ్రీకాకుళం , విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల(Bapatla) , పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడుతాయని వివరించారు.