తిరుపతి : తిరుపతి( Tirupati ) శ్రీ కోదండరామస్వామి(Kodandarama swamy)వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం శ్రీ రామచంద్రమూర్తి చిన్నశేష వాహనం(Chinna shesha vahanam,పై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు జరిగిన వాహనసేవలో గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించారు.

మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవలో భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహన సేవ అనంతరంకల్యాణ మండపంలో శ్రీసీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, వీజీవతో మనోహర్, ఏఈవో మోహన్, సూపరింటెండెంట్ రమేశ్, కంకణభట్టర్ ఆనందకుమార దీక్షితులు, భక్తులు పాల్గొన్నారు.