Srisailam | శ్రీశైల దేవస్ధానానికి తిరుపతి వాసి ఉదయ్ కుమార్ రెడ్డి సోమవారం ఎంజీ మోటార్స్ కారు ఆస్టర్ (MG Astor)ను విరాళంగా అందజేశారు. దీని విలువ రూ.15 లక్షలు. శ్రీశైలం ఈవో పెద్దిరాజుకు ఉదయ్ కుమార్ రెడ్డి ఈ కారును అందజేశారు. సోమవారం ఉదయం గంగాధర మండపం వద్ద వేద పండితులు పూజలు చేశారు.
అటుపై దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజుతోపాటు ఈఈ రామకృష్ణ, ఏఈవో మోహన్, స్వామివారి ఆలయ ప్రధానార్చకుడు శివప్రసాద్ పాల్గొన్నారు.