Tirumala Vaikunta Dwara Darshanam | తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఆన్లైన్లో ఈ డిప్ ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవవ్వగా.. గంటలోనే రికార్డు స్థాయిలో 2.16 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సాయంత్రానికి మొత్తం 4.60 లక్షల మంది నమోదు చేసుకున్నారు.
ఇదిలా ఉంటే డిసెంబర్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో ఈ డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు టీటీడీ అనుమతినిచ్చింది. దీంతో ఈ నాలుగు రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ 2వ తేదీన ఈ డిప్లో టోకెన్లు పొందిన భక్తుల జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 30 నుంచి తొలి మూడు రోజులు వారికి వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతినిస్తారు. మిగిలిన ఏడు రోజులు ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కల్పించడంతో పాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, శ్రీవాణి దర్శన టికెట్లను అందుబాటులో ఉంచనున్ననారు.
ఈ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, శ్రీవాణి కోటాను డిసెంబర్ 5వ తేదీన విడుదల చేస్తారు. ఈ టికెట్ల బుకింగ్ కోసం https://ttddevasthanams.ap.gov.in లేదా ttddevasthanams appను సంప్రదించవచ్చు. లేదా 95523 00009 వాట్సాప్ నంబర్లో వివరాలు నమోదు చేసి టికెట్లు పొందవచ్చు.