హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): శ్రీవారి జూన్ నెల టికెట్ల ఆన్లైన్ కోటాను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు, ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు, అంగ ప్రదక్షిణం టికెట్లను 24న విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఏప్రిల్ నెల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నది.