Tirumala | శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు తిరుమలలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయానికి ముందు ఉన్న ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగిపడింది. దీంతో ఆందోళన చెందిన టీటీడీ అధికారులు వెంటనే మరమ్మతు పనులను చేపట్టారు.
బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా సాయంత్రం ధ్వజారోహణంలో ఈ ధ్వజస్తంభంపై గరుడ పఠాన్ని ఈ కొక్కి ద్వారానే ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించనున్నారు. ఈ ధ్వజారోహణ ఘట్టంతోనే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే సాయంత్రం జరగబోయే ఈ ఘట్టానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలిస్తుండగా గరుడ పఠాన్ని ఎగురవేయాల్సిన ఇనుప కొక్కి విరిగిపోయినట్లుగా అర్చకులు గుర్తించారు. దీంతో ఆందోళన చెందిన అర్చకులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అపశృతి
విరిగిన ధ్వజస్తంభం ఇనుప కొక్కి
ఈరోజు సాయంత్రం తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం
గరుడపటాన్ని ఎగురవేయాల్సిన కొక్కి విరిగిపోవడంతో అధికారుల చర్యలు
ధ్వజస్తంభం మరమ్మతు పనులు చేపట్టిన టీటీడీ అధికారులు… pic.twitter.com/Ii9y3Evvq2— greatandhra (@greatandhranews) October 4, 2024
సమాచారం అందుకున్న టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆలయానికి చేరుకున్నారు. వారి ఆదేశాల మేరకు తక్షణమే మరమ్మతు పనులు ప్రారంబించారు. కాగా, భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కొక్కెం అతికించే ప్రక్రియ చేపట్టామని టీటీడీ వర్గాలు తెలిపాయి.