హైదరాబాద్, జనవరి 25(నమస్తే తెలంగాణ): తిరుమలలో ఆదివారం రథసప్తమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మినీ బ్రహ్మోత్సవంగా పేరుగాంచిన ఈ వేడుకల్లో భాగంగా శా స్ర్తోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. సూ ర్యోదయం వేళ అత్యంత శోభాయమానంగా సాగిన సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి సంబరాలు ప్రారంభమయ్యా యి.
అనంతరం వరుసగా చిన్నశేషవాహ నం, గరుడవాహనం, హనుమంత వాహనంపై శ్రీమలయప్ప స్వామి శ్రీమన్నారాయణుడి రూపంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమ ల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జేఈవో(విద్య, వైద్యం) గా నియమితులైన డాక్టర్ శరత్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించా రు. అనంతరం తమ కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.