హైదరాబాద్ : వచ్చే ఏడాది జనవరి నెల శ్రీవారి దర్శన టికెట్లను ఇవాళ, రేపు విడుదల చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు వర్చువల్ సేవా దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. జనవరి 1, 2, 26 తేదీలకు 5,500 వర్చువల్ సేవా దర్శన టికెట్లు, జనవరి 13 నుంచి 22 తేదీలకు 5,500 వర్చువల్ సేవా దర్శన్ టికెట్లు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఈ నెల 27న ఉదయం 9 గంటలకు వసతి గదుల బుకింగ్‌కు, వచ్చే నెల 11 నుంచి 14 వరకు వసతి కోసం తిరుమలలో కరెంట్ బుకింగ్‌కు అవకాశం కల్పించనున్నారు.