Tilak Varma : ఆసియా కప్ ఫైనల్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో టీమిండియాను గెలిపించాడు తిలక్ వర్మ (Tilak Varma). టాపార్డర్ విఫలమైనా ఒత్తిడికి లోనవ్వకుండా అజేయం అర్ధ శతకంతో భారత్‌కు తొమ్మిదో ట్రోఫీ అందించాడీ తెలుగబ్బాయి. పాకిస్థాన్ బౌలర్ల వ్యూహాల్ని చిత్తు చేస్తూ క్లాస్ బ్యాటింగ్‌తో అలరించిన తిలక్.. మ్యాచ్ అనంతరం ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)కు మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు. ఫైనల్లో తాను ధరించిన టోపీపై సంతకం చేసి లోకేశ్‌కు గిఫ్ట్గి ఇస్తున్నట్టు వెల్లడించాడీ చిచ్చరపిడుగు. ఈ విషయాన్ని ఏపీ మంత్రి ఇన్స్టాగ్రామ్ వేదికగా అందరితో పంచుకున్నాడు.
ఇంతకూ తిలక్ ఆ టోపీపై ఏం రాశాడో తెలుసా.. ‘డియర్ లోకేశ్ అన్నా.. లవ్ యూ అన్నా’ అని మార్కర్‌తో రాసి ఆటోగ్రాఫ్ చేశాడు. తిలక్ వర్మ నుంచి తనకు లభించిన ప్రత్యేక బహుమతి చూసి లోకేశ్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘నీ కానుకతో ఈ రోజు నా మనసెంతో పొంగిపోతోంది తమ్ముడు. నువ్వు భారత్‌కు వచ్చాక నీ చేతుల మీదుగా ఈ క్యాప్‌ను స్వీకరించేందుకు ఎదురుచూస్తున్నా’ అని లోకేశ్ పోస్ట్ చేశాడు.
ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఆసియా కప్ ఫైనల్లో తిలక్ కలకాలం గుర్తిండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ నిర్దేశించిన 147 పరుగుల ఛేదనలో 20కే మూడు కీలక వికెట్లు పడినవేళ క్రీజులోకి వచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండర్ జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. సంజూ శాంసన్(24), శివం దూబే(33)లతో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన తిలక్.. హ్యారిస్ రవుఫ్ వేసిన 19వ ఓవర్లో సిక్సర్‌తో జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. చివరి ఓవర్లో రింకూ సింగ్ బౌండరీతో టీమిండియా ఐదు వికెట్లతో పాక్‌ను చిత్తు చేసి తొమ్మిదోసారి ఛాంపియన్‌గా నిలిచింది.
🇮🇳🇮🇳🇮🇳❤️ pic.twitter.com/6OaaknFvhk
— Tilak Varma (@TilakV9) September 28, 2025