అమరావతి : వేసవి సెలవుల్లో సరదాగా గడపడానికి ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి దుర్మరణం చెందారు. చిత్తూరు జిల్లా ( Chittoor District ) వి.కోట మండలం మోట్లపల్లిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కుషాల్, నిఖిల్, జగన్ అనే ముగ్గురు స్నేహితులు సమీపంలోని చెరువులో ఈత కోసం వెళ్లారు.
వీరిలో ఒకరు చెరువులో మునిగిపోతుండగా మరో ఇద్దరు అతడిని కాపాడేందుకు దిగారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా స్థానికులు మరొకరిని ఒడ్డుకు చేర్చి చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో చనిపోయాడు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు ఉండడంతో వారి కుటుంబంలో , గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.