అమరావతి : ఏపీలో అనంతపురం జిల్లాలో (Anantapuram District) జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రభుత్వ వైద్యులు ( Doctors) దుర్మరణం చెందారు. బళ్లారికి చెందిన ఓపిడీ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ముగ్గురు వైద్యులు హంకాంగ్ పర్యటనకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదంలో కన్నుమూశారు. బళ్లారికి (Ballari) విమానాశ్రయానికి చేరుకుని నలుగురు కారులో బయలు దేరారు.
ఆదివారం ఉదయం అనంతపురం విడపనకల్లు వద్ద అతివేగంగా వచ్చి చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వైద్యులు గోవిందరాజలు, యోగేశ్ , ప్రైవేట్ ఆసుపత్రి మేనేజర్ వెంకట్నాయుడు అక్కడికక్కడే మృతి చెందగా అమరగౌడ్ అనే తీవ్రగాయాలయ్యాయి. అతడిని బళ్లారి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. .. చెట్టున ఢీకొన్న కారు నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.