అమరావతి : విశాఖనగరంలోని ఆర్కే బీచ్‌తో పాటు ఐటీహిల్స్లో పోలీసులమంటూ ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు నకిలీలను పోలీసులు అరెస్టు చేశారు. బీచ్‌లోకి వచ్చే జంటలు, మద్యం తాగేవారిని లక్ష్యంగా చేసుకుని వారిని బెదిరించి నగదు వసూళ్లకుపాల్పడుతున్న ముగ్గురు సభ్యులు గల ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలోని పాలూరివారి వీధికి చెందిన వి. వెంకటబాలకృష్ణ, వి. దుర్గావీరబాబుతో పాటు పీఎంపాలెం తులసీనగర్‌కు చెందిన జి.గణేశ్బాబుతో కలిసి కొంతకాలంగా పోలీసులమంటూ దోపిడీకి పాల్పడుతున్నారు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు స్పందించిన పోలీసులు నిందితుల సెల్‌ఫోన్ ఆధారంగా పట్టుకుని వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.