అమరావతి : ఏపీలోని అల్లూరి (Alluri District ) జిల్లాలో విషాదం (Tragedy) చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. జిల్లాలోని డుంబ్రిగూడ మండలం గుంటసీమ గ్రామానికి చెందిన ముగ్గురు ఆదివారం ఉదయం చెరువులో ఈతకు ( Swimming) వెళ్లారు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఊపిరాడక మృతి చెందారు.
మృతులు కొర్ర సుశాంత్, కోతంగి పంచాయతీ బిల్లాపుట్ గ్రామానికి చెందిన గుంట భానుతేజ, సాయికిరణ్‌గా గుర్తించారు. సాయికిరణ్ వేసవి సెలవుల కారణంగా వారం క్రితం మేనమామ ఇంటికి రాగా ఈ దుర్ఘుటన జరిగింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.