తిరుమల : తిరుమలలో (Tirumala) నకిలీ ఆర్మీ (Fake Army ) ఐడీతో మోసగించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల ఎన్సీసీ క్యాంటీన్లో మేనేజర్‌గా పనిచేస్తున్న బ్రహ్మయ్య అనే ఉద్యోగి విశ్రాంత సైన్యాధికారి గుర్తింపు కార్డులో బ్రిగేడియర్‌గా హోదా మార్చి సైన్యాధికారి విధి నిర్వహణలో ఉన్నట్లు నకిలీ ఐడీ తయారు చేశాడు.
నకిలీ ఆర్మీ ఐడీతో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు పొందిన ఆయన రూ. 2వేలు విలువ చేసే 4 టికెట్లను రూ. 40 వేలకు విక్రయించాడు. ఈ కేసులో ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు బ్రహ్మయ్యతో పాటు అక్రమాలకు సహకరించిన బంధువు రాజుపై, ఐడీ కార్డు నకిలీ చేసేందుకు సహకరంచిన జిరాక్సు దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని తిరుమల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.