అమరావతి : వైసీపీ నాయకులు ముంబై సినీ నటి జత్వానీ (Actress Jatwani) పై పోర్జరీ కేసులు పెట్టి ఇబ్బందులపాలు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu ) ఆరోపించారు. ఈ ఘటనపై తొలిసారి స్పందించిన ఆయన వైఎస్ జగన్ను డ్రగ్ డాన్ ఫ్యాబ్లో ఎస్కోబార్గా(Escobar) పోల్చారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో మొక్కను నాటారు.
ఈ సందర్భంగా సీఎం నటి జత్వానీ కేసు గురించి బహిరంగ సభలో మాట్లాడారు. బాధితులను రక్షించాల్సిన పోలీసులే ఆమెను బెదిరించి, చిత్రహింసలకు గురిచేసి అరెస్టు చేసి కస్టడీలో పెట్టారని ఆరోపించారు. వైసీపీ పాలనలో ప్రజలంతా భయపడ్డారని, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో స్వేచ్ఛ వాతావరణం కనిపిస్తుందని అన్నారు. ఎస్కోబార్లాంటి వ్యక్తులు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్ సర్శనాశనం అవుతుందని పేర్కొన్నారు.