Buddha Venkanna | సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబంపై వ్యక్తిగత దూషణలు చేసిన ఎవరిని వదిలిపెట్టమని తెలిపారు. విజయవాడలో బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీపై పేట్రేగిపోయిన వైసీపీ నేతలను నియోజకవర్గాల వారీగా తరిమికొడతమని హెచ్చరించారు.
చంద్రబాబును ఫినిష్ చేస్తానని రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో అన్నాడని.. కానీ భగవంతువు వైఎస్‌నే లేకుండా చేశారని బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కూడా బాబుపై అనేక వ్యాఖ్యలు చేశారని అన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని జగన్ అన్నాడని.. కానీ జగన్‌కు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా రాలేదని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై జగన్ కామెంట్ చేశారని.. ఇప్పుడు పవన్ రంకు మొగుడయ్యారని విమర్శించారు. రాజకీయాలకు జగన్ స్వస్తి చెప్పాల్సిందేనని అన్నారు. ఇక జగన్ జీవితం జైలుకేనని స్పష్టం చేశారు. జగన్ మూడు జన్మలు ఎత్తినా తరగని శిక్షలు పడతాయని అన్నారు. త్వరలో సజ్జల రామకృష్ణారెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. కేంద్రంలో చంద్రబాబుది కీలక పాత్ర అని చెప్పారు.