తిరుమల: ధనుర్మాసం సందర్భంగా తిరుమలలోని శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి మఠంలో తిరుప్పావై పారాయణం శుక్రవారం నుంచి ప్రారంభమైంది . ఈ కార్యక్రమం జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు జరుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీ రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన కైంకర్యాలు, క్రతువులు సేవలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
దీంట్లో భాగంగా తిరుప్పావై పారాయణా న్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ తిరుమల పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ తిరుమల చిన్నజీయర్‌స్వామి, ఇతర పండితులు పాల్గొన్నారు.