అమరావతి : ఏపీలోని గుంటూరు జిల్లాలో దొంగలు భీబత్సం సృష్టించారు. కేవీపీ కాలనీలోని మిర్చి
ఎగుమతుల కంపెనీలోకి చొరబడ్డ దొంగలు రూ. 20 లక్షల నగదును దోచుకెళ్లారు. ముందుగా కంపెనీ
ముందుగా కంపెనీ వద్ద ఉన్న కాపలా కుక్క అరవకుండా చికెన్ ముక్కలు వేసి దొంగలు కంపెనీలోకి
చొరబడి వాచ్మెన్పై దాడికి పాల్పడ్డారు. ఆయన ప్రతిఘటించడంతో అతన్ని బంధించి కాళ్లు, చేతులు
కట్టేశారు.
కంపెనీలోని బీరువాను బద్దలు కొట్టి అందులో దాచిన మిర్చి డబ్బులు రూ. 20 లక్షల నగదును
దోచుకెళ్లారు. ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.