అమరావతి : పుట్టినరోజు సందర్భంగా వేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేదని చేసిన దాడిలో ఎమ్మెల్సీ అనుచరుడు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్ పుట్టినరోజు వేడుకలను ఈనెల 16న నిర్వహించడానికి అతడి అనుచరులు శుభాకాంక్షలను తెలియజేస్తూ పట్టణంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
అయితే ఈ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేదని ఎమ్మెల్యేకు చెందిన అనుచరులు ఎమ్మెల్సీ అనుచరులపై దాడులు చేశారు. ఈ దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఎమ్మెల్సీ వర్గీయుల ఫిర్యాదు మేరకు 3వటౌన్ పోలీసులు ఎమ్మెల్యే అనుచరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.