అమరావతి : తెలుగుదేశం ( TDP ) పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌రావు (Palla Srinivas rao ) సంధ్యా థియేటర్ ఘటన. అల్లు అర్జున్ (Allu Arjun Arrest ) అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ఏపీలో మీడియాతో మాట్లాడారు. పుష్ప-2 సినిమా (Puspa-2) ప్రదర్శన సందర్భంగా అక్కడికి హీరో అల్లు అర్జున్ రాకతో జరిగిన తొక్కిసలాటలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోందని అన్నారు.
ఇంటెలిజెన్స్ ( Intelligence ) వ్యవస్థ ముందుగానే అంచనాలు వేయడం బాధ్యత అని గుర్తు చేశారు. ఫిల్మ్ స్టార్స్ కూడా పరిస్థితిని అంచనా వేయగలగాలని , ప్రభుత్వం కూడా ఆలోచించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. ఆ సమయంలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్లాల్సింది కాదని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలుగకుండా చూడాలని, బాధిత కుటుంబానికి అండగా నిలబడాలని వెల్లడించారు . తప్పులను ఎత్తిచూపడం కంటే బాధిత కుటుంబానికి అండగా నిలబడాలని అన్నారు.
ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయని, సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని పవన్‌కల్యాణ్ కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తామన్నారు. గతంలో కంటే ఎక్కువగా హైదరాబాద్ చాలా రద్దీగా మారిందదని, మరో చోట పరిశ్రమ అభివృద్ధి చెందాలని అది ఏపీ అయితే మరి బాగుంటదని అన్నారు. సినీ పరిశ్రమ ఏపీకి వస్తే ఉపాధి పెరుగుతుందని, కళాకారులకు చేతి నిండా పనిదొరుకుతుందని పేర్కొన్నారు.