అమరావతి : స్త్రీ విద్యపై ప్రప్రథమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయి పూలే ( Savitribai Phule) అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. సావిత్రిబాయి 194 వ జయంతి సందర్భంగా ట్విటర్ ( Twitter) వేదిక ద్వారా ఘననివాళి అర్పించారు.
కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రీ బాయి స్ఫూర్తి అందరికీ ఆదర్శమన్నారు. ఆనాటి కట్టుబాట్లను కాదని 1848లోనే సావిత్రిబాయి పూలే పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించడం అనేది అసామాన్య విషయమన్నారు. ఆనాటి ఆమె చొరవ తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారత సిద్ధాంతానికి ఆలంబనగా మారి మహిళా రిజర్వేషన్లకు దారి తీసిందని గుర్తు చేశారు.
విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యం : వైఎస్ జగన్
విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan ) పేర్కొన్నారు. సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా జగన్ ట్విటర్ వేదిక ద్వారా స్పందించారు. బాలికా విద్య ఉద్యమానికి పునాది వేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే నని వెల్లడించారు. ఆమె పోరాటాలను, సేవలను స్మరించుకుంటూ నివాళి అర్పించారు.