తిరుమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని ఆదివారం ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ( Srinivas ) , గాయని స్మిత( Smita ) , టీమ్ ఇండియా ఫీల్డింగ్ మాజీ కోచ్ దిలీప్‌తో పాటు పలువురు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. నిన్న స్వామివారిని 90,211 మంది భక్తులు దర్శించుకోగా 43,346 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.11 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.