YS Jagan | ఏపీలో పోలీసు వ్యవస్థ దిగజారి పోయింది : వైఎస్ జగన్
YS Jagan | ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ( AP Police ) వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan ) ఆరోపించారు. విజయవాడలోని కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలో సీఐ నాగరాజు వేధింపులతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించి ఓదార్చారు. క్రాంతి కుమార్ కుటుం సభ్యులకు వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ట్యాక్సీ నడుపుకునే సాధారణ వ్యక్తిని సీఐ నాగరాజు వేధింపులకు గురి చేయడంతో వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. అతని కుటుంబాన్ని పోలీసులే చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు.
ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు. క్రాంతి కుటుంబానికి న్యాయపరంగా సహాయం చేస్తామని వెల్లడించారు. నెల రోజుల వ్యవధిలోనే రెండు దారుణ ఘటనలు సాయికృష్ణ లాకప్‌డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్య చోటు చేసుకున్నాయని ఆరోపించారు. పోలీసు స్టేషన్లో సీసీ టీవీ ఫుటజీ మాయమైపోతే బ్యాకప్ ఉండదా అంటూ ప్రశ్నించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

