అమరావతి : కేసు విషయంలో బాధితుడిని బెదిరించి లంచం (Bribe) డిమాండ్ చేసి న పోలీసు అధికారులు ఏసీబీ(ACB) అధికారుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. చివరకు ఒక ఎస్ఐని అదుపులోకి తీసుకున్న వైనం శ్రీ సత్యసాయి జిల్లా (Sri Satya Sai District) లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు. జిల్లాలోని సీకేపల్లి సర్కిల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ ప్రేమ జంట కులాంతర(Intercast marriage) వివాహం చేసుకుంది.
ఈ వివాహం నచ్చక వధువు తరుఫు కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్లో వరుడిపై కేసు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేపట్టిన సీకేపల్లి సీఐ గౌస్, కనగానపల్లె ఎస్ఐ హనుమంతరెడ్డి కేసు పేరుతో బెదిరించి బాధితుడి నుంచి రూ.2. 5లక్షలు డిమాండ్ చేశారు. పోలీసుల ఒత్తిడికి బయపడ్డ యువకుడు అవినీతి నిరోదక శాఖ అధికారులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసుకున్నారు.
సదరు యువకుడు శుక్రవారం రూ. లక్ష తీసుకొని వస్తుండగా అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులను చూసి సీఐ, ఎస్ఐ అక్కడి నుంచి పారిపోయారు. చివరకు ఎస్ఐను అదుపులోకి తీసుకుని విచారించి, పరారైన సీఐ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.